వందల సంఖ్యలో బీజేపీ,బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు

నవతెలంగాణ – డిచ్ పల్లి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమోల్లా దత్తద్రి , సక్కర్ల రాజన్న, నర్సగౌడ్, సందీప్, రజనీకాంత్, విజయ్, సహకార సొసైటీ చైర్మన్ తరచంద్ నాయక్ ల అద్వర్యంలో బిజెపి, బిఅర్ఎస్ నుండి దాదాపు, రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీ లో  మంగళవారం చేరారు.చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంపూర్ డి గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ రాజ్ కుమార్,లింగుల లింగం, బక్కన్న తో పాటు విడిసి సభ్యులు, సోసైటి డైరెక్టర్లతో పాటు బిజెపి, బిఅర్ఎస్ పార్టీ లకు చెందిన నాయకులు కార్యకర్తలు చేరడం అభినందన మన్నారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని వారందరికీ సూచించారు.గ్రామంలో ఏలాంటి అబివృద్ది కావాలన్న తనవంతుగా పాటు పడతానని, అనునిత్యం వందలాది మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లచ్చమోల్లా దత్తద్రి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అరునురైన అమలు చేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పలు హామీ లను అమలు చేస్తుందని వివరించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని,  మేమందరం ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సోసైటి చైర్మన్ చిన్నిలింగుల చిన్నయ్య, మాజీ సర్పంచ్ అశాన్న,ఎంపిటిసి భర్త పోతర్ల రవి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్ తో పాటు బిసి, ఎస్సీ , మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love