అక్రమ మద్యం స్వాధీనం

– పోలీసుల అదుపులో ఒకరు..
నవతెలంగాణ – నాగోల్‌
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన నాగోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగోలు డివిజన్‌లోని పి.ఎం.ఆర్‌ గార్డెన్‌ ముందు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని నాగోల్‌ పోలీసులు తెలిపారు.వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉప్పల్‌ మండలం శాంతినగర్‌కు చెందిన భూక్య రమేష్‌ అనే వ్యక్తి కారులో 216 బీరు సీసాలను విక్రయించడానికి తరలిస్తుండగా…పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న మద్యాన్ని, కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Spread the love