
నవతెలంగాణ – చేర్యాల
చేర్యాల పట్టణంలోని శ్రీ మల్లికార్జున క్లినిక్ లో బుధవారం పట్టణానికి చెందిన కొంతమంది పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో సిద్దిపేట జిల్లా టాస్క్ ఫోర్స్, చేర్యాల పోలీసులు కలిసి పేకాట స్థావరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న చిలుకూరి రమేష్, ఏను శెట్టి అమర్నాథ్, బుడిగె శ్రీధర్, ఉప్పులూరి శ్రీధర్, మోటు గౌరీనాథ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి ఐదు సెల్ ఫోన్లు, 34,890 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఎవరైనా వ్యక్తులు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.