– 19న పాలస్తీనా సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలి : వామపక్ష పార్టీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ నిరంతర బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతున్నదని వామపక్ష పార్టీలు విమర్శించాయి. అక్కడ మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని తెలిపాయి. ఇప్పటికే దాదాపు 50 వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ చేస్తున్న మారణహో మాన్ని, యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశాయి. శనివారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో వామపక్ష పార్టీల సమావేశం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్య పద్మ (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి (సీపీఐ(ఎం), వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్దన్ (సీపీఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ), రమేష్‌రాజా (సీపీఐ(ఎంఎల్) లిబరేషన్), సిహెచ్ మురహరి (ఎస్‌యూసీఐ(సీ)) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గాజాలో మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు, శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటు న్నదని విమర్శించారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని తెలిపారు. ఐక్యరాజ్య సమితితోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇది కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్‌పై కూడా యుద్ధాన్ని ప్రకటించి బీభత్సం సృష్టిస్తు న్నదని తెలిపారు. అంతర్జాతీయ చట్టం, మానవహక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఈ దురహంకార మారణహోమ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలనీ, ఇజ్రాయిల్‌తో అన్ని సైనిక, భద్రతా సహకారాన్ని వెంటనే నిలిపేయా లని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో పాలస్తీనాకు సంఘీభావం గా కార్యక్రమాలు నిర్వహించాలని అఖిలభారత వామపక్ష పార్టీలు పిలుపుని చ్చాయని గుర్తు చేశారు. వామపక్ష పార్టీలు, ప్రపంచశాంతిని కోరుకునే ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు పెద్దఎత్తున పాల్గొని మద్దతు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES