Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండ్రి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

తండ్రి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తన తండ్రి మాదప్ప షిండే వర్ధంతిని ఆదివారం స్వగ్రామం డోన్గాంలో సాయంత్రం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ శ్రేణులతో కలిసి తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్ధంతి వేడుకలను నిర్వహించారు. తన తండ్రి సాధారణ పౌరుడుగా గ్రామంలో జీవనం కొనసాగించారని, నిజాయితీగా గ్రామీణ ప్రాంతంలో ఉంటూ మంచి గుర్తింపు పొందారని,  తనకు ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నారని, జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కంటతడిపెట్టారు. ఈ వర్ధంతి వేడుకలలో గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి జ్ఞాపకార్థం మహా అన్నదానం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -