నవతెలంగాణ – ( వేల్పూర్ ) ఆర్మూర్
విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని వెంకటాపూర్ రోడ్డులో గల సాయి కృష్ణ రైస్ మిల్ దగ్గర అనుమానస్పద తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల దగ్గర రెండు కిలోల 100 గ్రాముల గంజాయితో పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై వినయ్ కుమార్, ముప్ కాల్ ఎస్సై భాస్కర చారిలు సోమవారం తెలిపారు. నిర్మల్ జిల్లా కి చెందిన ఇద్దరు వ్యక్తులు బాల్కొండ, వేల్పూర్, భీంగల్ మండలాల యువత కి నిషేధిత గంజాయి సప్లై చేయడానికి వస్తున్నారని, అనుమానాస్పదం గా కనిపించడం తో వారిని ఆపి వారి దగ్గర ఉన్న సంచిని చెక్ చేయగా అందులో నిషేధిత గంజాయి దొరికింది. సయ్యద్ అజీమ్, షేక్ అద్నాన్ సోహెల్, ఇద్దరు నిర్మల్ కి చెందిన వారు అని తెలిపారు. కొన్ని రోజులు గా బాల్కొండ, వేల్పూర్, భీంగల్ మండలాల యువత ని టార్గెట్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశం తో మహారాష్ట్ర నుండి గంజాయి ని తక్కువ రేటు కి కొనుక్కొని వచ్చి ఇక్కడ వారికి ఎక్కువ రేటు కి అమ్ముతున్నాము అని నేరం ఒప్పుకున్నారు, వారిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విజయ్, సందీప్, శ్రావణ్, భరత్ పాల్గొన్నారు.