జవహర్‌ బాలభవన్‌లో ముగింపు వేడుకలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జవహర్‌ బాలభవన్‌లో ముగింపు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. శుక్రవారం పబ్లిక్‌ గార్డెన్‌లోని జవహర్‌ బాలభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. నృత్యం, స్కేటింగ్‌ తదితర విషయాల్లో తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, చిన్నారులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు వేడుకలు నిర్వహించినప్పటికీ తరగతులు యధావిధిగా ప్రతి రోజు జరుగుతాయని స్పష్టం చేశారు. కళలు, క్రీడల్లో ఆసక్తిని ప్రోత్సహిస్తే పిల్లలు చదువుల్లోనూ రాణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love