స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చు: ఆఫీసర్ రవికుమార్

నవతెలంగాణ – ఆర్మూర్ 

చదువుతోపాటు ఆటలలో ముందుండడం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ అన్నారు.. మండలంలోని   మగ్గిడి పాఠశాలలో జరుగుతున్న వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సందర్శించినారు ..ఈ సందర్భంగా  మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాలలో ఇంత గొప్పగా ఆడే క్రీడాకారులు వేసవికాలంలో ఫోన్లకు ఇతర విషయాలకు దూరంగా ఉండి మంచిగా వ్యాయామం చేస్తూ ఆటలాడుతూ ఉన్న పిల్లలను చూస్తే తనకు చాలా ఆనందంగా ఉందని ఇలాగే బాగా ఆటలాడి శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని కోరుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించడం జరిగింది.. వేసిన శిక్షణ శిబిరానికి రూ.10,000 రూపాయలు బహుకరించడం అభినందనీయమని వ్యాయామ ఉపాధ్యాయులు మధు తెలిపారు.
Spread the love