Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భవిత కేంద్రంలో అన్ని రకాల వసతులు: ఎంఈఓ

భవిత కేంద్రంలో అన్ని రకాల వసతులు: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర: ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులైన పిల్లలకు భవిత కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని మండల విద్యాధికారి తరి రాము అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని భవిత కేంద్రంలో రూ.2,00,000 లతో ఆధునీకరిస్తున్న పనులను పరిశీలించి మాట్లాడారు. బాలబాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటివి వాటిలో చక్కగా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. ప్రత్యేక అవసరాల బాల బాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటివి వాటిలో శిక్షణ అందించి ఇతర పిల్లలతో సమానంగా విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటికి సంబందించిన పరికరాలు త్వరలో ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని మరో ఒక్క రోజులో పనులు పూర్తి అవుతాయని తెలిపారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలైన ర్యాంప్, టాయిలెట్స్, రైలింగ్, తాగునీరు వంటి కనీస వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాక వారికి తగ్గట్టుగా కృత్యాధార పద్ధతిలో బోధన ఉండేలా సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -