నవతెలంగాణ – పెద్దవూర
ఈ నెల 9 వ తేదిన నల్లగొండ పట్టణ కేంద్రం లో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్తాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెగా అవగాహన సదస్సు నిర్వహింస్తున్నామని మంగళవారం వ్యవస్తాపక అధ్యక్షులు ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సమావేషంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రస్తుత పరిస్థితులు- భవిష్యత్తు కార్యచరణపై సదస్సు ఉంటుందని తెలిపారు. ఈ సదస్సు కు నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి – భువనగిరి జిల్లాల లోని జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గల కమిటీల సభ్యులు, మండలాల కమిటీల సభ్యులు అన్ని కమిటీల బాధ్యులు, మహిళా కమిటీల సభ్యులు, హాజరుకావాలని కోరారు.డ్రెస్ కోడ్, ఐడీ కార్డ్,సమయపాలన విధిగా పాటించాలని తెలిపారు.ఈ అవగాహన సదస్సు కు ముఖ్యఅతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ప్రత్యేక అతిథులుగా హాజరవు తున్నారని అన్నారు. వారితో పాటు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్,బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గౌఅబ్బగోని రమేష్,నల్గొండ మాజీ జెడ్పిటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, ఎస్ హెచ్ వీ ఎస్ గౌరవఆధ్యక్షులు కాచం సత్యనారాయణ, ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ సలహా దారులు గోనా రెడ్డి,సీనియర్ జర్నలిస్టు,సలహాదారులు కోటగిరి దైవా దీనం, గాదె వినోద్ రెడ్డి, ఏళ్ల చంద్రారెడ్డి,హాజరవు తున్నారని సభ్యత్వం వున్న ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలిపారు.