సమాచార హక్కు చట్టం వజ్రాయుధం కంటే పవర్ ఫుల్

నవతెలంగాణ – పెద్దవూర
సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని ఆది వజ్రాయుధం కన్న పవర్ ఫుల్ అని తెలుగు రాష్ట్రల మాజీ సమాచార హకు చట్టం కమిషనర్ ముఖ్య సలహాదారులు వర్రె వెంకిటేశ్వర్లు.పేర్కొన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని అర్య సమాజ్ ఫంక్షన్ హాల్లో సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు -2024 పై అవగాహన కల్పించారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం కోసం ఆర్‌టీఐ ఎంతో దోహదపడుతోందని అన్నారు.ఈ అవగాహన సదసదస్సుకు వ్యవస్థాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, పాల్గొన్నారు. ఈసందర్బంగా వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అవగాహనలు సమాచార హక్కును విలువైన పౌర హక్కుగా గుర్తించిన నేపథ్యంలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని 12 /10 /2005 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పౌర సమాచార అధికారి ఈ చట్టం పేర్కొన్న విధులను నిర్వహిస్తూ ఉంటారని ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రకారం రికార్డులు దస్తావేజులు మెమోలు ఈ-మెయిల్ అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్కులర్లు, ఉత్తర్వులు, రిజిస్టర్లు, కాంట్రాక్టులు, నివేదిక నమూనాలు, క్రోడీకరించబడిన సమాచార గ్రంథం లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిక్షిప్తం చేయబడి ప్రతి అంశం సమాచార అధికారి సెక్షన్- 8 లో ఇచ్చిన నిబంధనలకు లోబడి సమాచారం కాపీలను అర్జీదారునికి అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థను జవాబు దారితనంతో అవినీతి రహితంగా పని చేయాలంటే ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా పోషించాలని కోరారు. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతుందని ప్రజలందరికీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి వారిని చైతన్య పరిచి సహ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సభ్యులను కోరారు. కొన్ని ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు అందించాలని సూచించారు.అలా ఇవ్వని అంశాలపై ప్రజలు, పౌర సమాచార అధికారులతో నల్గొండ లో పిర్యాదు చేయాలని తెలిపారు. పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకుంటే చట్టం ప్రకారం అప్పీలేట్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సమాచారం చెప్పడం ఆ సమాచారం కలిగివున్న వారి బాధ్యత. ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని– ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చిందని తెలిపారు.ప్రభుత్వ పాలన సవ్యంగా ఉండాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, సత్యంకోసం, స్వేచ్ఛకోసం, నీతికోసం, ప్రజా శ్రేయస్సు కోసం, సంక్షేమ అభివృద్ధి ఫలాల కోసం భావించాలన్నారు.అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడం సహ చట్టం లక్ష్యంఅని తెలిపారు.ఈ చట్టం అనేక రకాల సమాచారాన్ని వెలుగులోకి తీసుకు వస్తున్నందున, జనరంజక పాలన, ప్రజాశ్రేయస్సు సాధ్యపడతాయన్నారు.మారుమూల ప్రాంతాలలోని పరిస్థితులను గమనించినట్లయితే, పెద్దోళ్ళు పంచాయతీలను ఇతర ఉద్యోగులను తమకు అనుగుణంగా ఉంచుకొని, ప్రజాధనం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరకుండా అడ్డుపడుతూ ఉంటారన్నారు.మరికొన్ని చోట్ల ఏ అధికారి ఏ తప్పుడు కాంట్రాక్ట్ ద్వారా ప్రజాధనం వృధా చేస్తున్నాడో తెలియదు. ప్రభుత్వం నుంచి సమాచారం అడిగినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకొస్తాయని,అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా నివారించడం సాధ్యపడుతుందని తెలిపారు.సహ చట్టం అన్ని శాఖల పనితీరును ప్రశ్నించింది, ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు సకాలంలో ప్రజలకు తెలియచెప్పిందని,ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అమలు కావడానికి సమాచార హక్కు చట్టం వారధిగా నిలుస్తున్నదని తెలిపారు.అధికార యంత్రాంగం పొరపాట్లు చేయకుండా ఈ చట్టం ఉపయోగపడుతున్నది. ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగించే చీకటి పనులను అంతం చేయడానికి అండగా నిలిచిందని అన్నారు.పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాలుపడిన వారి చిట్టాను వెలుగులోకి తీసుకొచ్చి పేదవాళ్లకు భరోసానిచ్చిందని తెలిపారు.ఇప్పుడు ప్రతి పౌరుడికి చట్టబద్ధమైన హక్కు ఉన్నది. అన్ని కార్యాలయాల్లో ఈ చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని అందించడం కోసం అధికారులున్నారన్నారు.సమాచార హక్కు చట్టం గురించి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కూడా చేస్తున్నది. తద్వారా ప్రభుత్వం కాంక్షిస్తున్న పారదర్శక, అవినీతిరహిత వ్యవస్థ కోసం కృషిచేస్తున్నది. తెలంగాణ సమాచార కమిషన్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్ ద్వారా కేసులు విచారించి కొన్ని కేసులు పరిష్కరించిందని అన్నారు.తెలంగాణ సమాచార కమిషన్ చేస్తున్న కృషి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ చట్టం ప్రకారం సమాచారం అడిగి తెలుసుకోవడం చాలా సులభం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు ఉంటుందని అక్కడి ప్రజా సమాచార అధికారి ఫోన్ నెంబర్ ఉంటుందని ఆప్రభుత్వ కార్యాలయంలోనికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి, లేక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక జిరాక్స్ పెట్టి సెక్షన్6(1) కింద దరఖాస్తు చేసుకుంటే,మండల స్థాయిలో, ఐదు రూపాయలు, జిల్లా, రాష్ట్రస్థాయిలో పది రూపాయలు రుసుం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు,మిర్యాలగూడ అధ్యక్షులు ఎండీ ఖలీమ్, మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు రాం చంద్రారెడ్డి, సాగర్ నియోజకవర్గం అధ్యక్షులు ప్రకాష్,పెద్దవూర మండల అధ్యక్షులు మూల శేఖర్ రెడ్డి, బాల క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love