కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ

– రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చాటిన న్యూ కిడ్స్ ఉన్నత పాఠశాల విద్యార్థి
నవతెలంగా – పెద్దవూర
ఈ నెల 11నుంచి 14 వరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో న్యూ విజన్ జూనియర్ కళాశాల విద్యార్థి చింతల హనుమాన్ ఎంపిక కావడం పట్ల  ఉత్తమమైన ప్రతిభా కనబరిచినందుకు విద్యార్థిని గురువారం అబ్బాస్ ఏడ్యూకేషనల్ సొసైటీ ఛైర్మెన్ ఎస్ కే అబ్బాస్ ఆ విద్యార్థిని శాలువా పూలబొకేతో సన్మానించి అభినందించారు. మండలం లోని తుంగతుర్తి గ్రామానికి చెందిన సత్యనారాయణ వద్ద కోచింగ్ తీసుకొని రాష్ట్ర స్థాయికు ఎంపిక కావడం పట్ల న్యూ విజన్ జూనియర్ కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘన సన్మానం చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకె పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తూనే జాతీయస్థాయిలో మెన్స్ కబడ్డీ పోటీల్లో అత్యుత్తమప్రతిభను కనబరిచినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదు అని నిరూపించారు చింతల హనుమాన్ ఆదర్శంగా తీసుకోవాలని, భవిష్యత్తులో క్రీడారంగంలో అత్యుత్తమ స్థాయికి చేరుకునేందుకు కళాశాల ఎప్పుడు తోడ్పాటు అందిస్తుందని,  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు.

Spread the love