సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు

నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా నోటీసు ఇచ్చారు. సీఎం తన ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Spread the love