భారీగా పెరిగిన చికెన్ ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్ : చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ రూ.294 కి చేరింది.  విత్ స్కిన్ చికెన్ ధర రూ. 258 గా ఉంది. వేసవి తాకిడి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. గత ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర ఇప్పటికంటే సుమారు రూ.30 రూపాయలు తక్కువగా ఉంది.  రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love