
సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో మండలంలోని చేపూర్ క్షత్రియ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 97% ఉత్తీర్ణతను పాఠశాల సాధించింది. పాఠశాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఉత్తీర్ణత సాధించారు .వెలుమల శ్రీశాంత్ 89%, మైలారం వర్షిత్ రెడ్డి 84%, దుబ్బాక మధురిమ 82%, కొండం వేదశ్రీ 80% ఇలా మరెన్నో ఉత్తీర్ణత శాతాన్ని క్షత్రియ విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యాసంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహ స్వామి విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు.డిసెంబర్ నుండి ఫైనల్ పరీక్షల వరకు 62 రోజుల పాటు నిరంతరంగా నిర్వహించబడిన ఇంటెన్సివ్ కోచింగ్ లో ప్రతి పాఠంలో నుండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించి, చదివించడం జరిగిందని ప్రిన్సిపల్ పి. లక్ష్మీ నరసింహస్వామి అన్నారు.క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ తమ సందేశంలో సీబీఎస్ఈ పదవ తరగతి లో ఈ ఫలితాలు రావడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఇంతటి ఘనత సాధించిన విద్యార్థులకు అధ్యాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..