మహతి ఆశ్రమానికి విరాళం అందజేత..

నవతెలంగాణ – ఆర్మూర్  

రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్వారీ గోపికృష్ణ అద్యక్షతన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విక్రం సింహా రావు మహతీ ఆశ్రమానికి విద్యార్థుల అవసర నిమిత్తం రూ.3000 రూపాయలు ఆశ్రమానికి విరాళంగా ఆశ్రమ ఇన్చార్జి నరేష్ కుమార్ కి మంగళవారం అందించారు. ఈ సందర్భంగా విక్రమ్ సింహరావు మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి నిరాశ్రయ విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, మనం చేసే కొంత సహాయమైనా విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత స్థాయి నిలవడానికి సహాయపడుతుందని ప్రతి ఒక్కరూ సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని  ప్రజలకు, నేటి యువతరానికి దేశాన్ని అందించారు. నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, ఆశ్రమన్నీ నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారీ తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, పట్వారీ బాల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love