హామీలు నెరవేరాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి

– రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – రాయపర్తి
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడానికి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభివర్ణించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ విద్యావంతుడైన యువకుడు రాకేష్ రెడ్డికి పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలపై కొట్లాడే సత్తా ఉన్న వ్యక్తి రాకేష్ రెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. హామీలు నెరవేరాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జీలు రసమయి బాల కిషన్, చెల్మడ లక్ష్మి నరసింహ రావు, మాట్లాడుతూ మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహా నాయక్, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, జిల్లా పార్టీ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, మండల రైతు బందు కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు, పిఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రా రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, యూత్ అధ్యక్షుడు ముత్తడి సాగర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు చెవ్వు కాశీనాథం, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love