– ఎక్కడిక్కడ నిలిచిన మురికి నీరు
– దుర్గంధం వెదజల్లుతున్న వైనం
– పట్టించుకోని ప్రజా ప్రతినిదులు, అధికారులు
నవతెలంగాణ – మాక్లూర్
సీసీ రోడ్డులో వేశారు. ప్రక్కనే డ్రైనేజీ వేయడం మరువడంతో నూతనంగా నిర్మించిన ఇండ్ల నుంచి వచ్చిన నీరు కుంటల ఏర్పడి దుర్గంధాన్ని వెదజల్లుతున్నయి. ఈ సంఘటన మండలంలోని అమ్రాద్ గ్రామంలోని నూతనంగా ఏర్పడిన కాలనీలో కనిపిస్తుంది. స్థానిక ప్రజలు డ్రైనేజీని ఏర్పాటు చేయాలని అధికారులను, ప్రజా ప్రతి నిధులను వేడుకున్న పట్టించుకోలేదని అంటున్నారు. మురికి కాలువ వల్ల ఇప్పటికే దోమలు చేరాయన్నరు. వచ్చేది వర్ష కాలం వర్షాల వల్ల నీరు నిలువ చేరి మరింత దుర్గంధం వదజల్లుతుందని, వెంటనే అధికారులు, ప్రజా ప్రతి నిధులు డ్రైనేజీనీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.