బడి తెరిచే నాటికే విద్యార్ధుల ఏకరూపు దుస్తులు అందుబాటులోకి..

– మహిళా శక్తి కుట్టు కేంద్రాలు పనితీరును సమీక్షించిన ఎం.పి.డీ.ఓ శ్రీనివాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ విద్యా సంవత్సరం బడి తెరిచే నాటికే విద్యార్ధులకు ఏక రూప దుస్తులు అందుబాటులో ఉండాలని ఎంపీడీఓ జీ.శ్రీనివాస్ మహిళా శక్తి కుట్టు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.మంగళవారం ఆయన సెర్ప్ ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి తో కలిసి ఏక రూప దుస్తులు తయారీ పై సమీక్ష నిర్వహించారు.స్థానికి సెర్ప్ కార్యాలయంలో మండల విద్యా వనరులు కేంద్రం సిబ్బంది,సెర్ప్ కార్యాలయ సిబ్బందితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 3856 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు ముందుగా వస్త్రాన్ని సరఫరా చేస్తారని,దుస్తులు కుట్టే బాధ్యతను స్థానిక మహిళా సమాఖ్య సభ్యులకు అప్పగించి మహిళా శక్తి కుట్టు కేంద్రాలు ద్వారా దుస్తులు రూపొందిస్తున్నామని అన్నారు.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో స్త్రీ శక్తి భవన్,బీసీ కాలనీ,చిన్నం శెట్టి బజారు,పేరాయిగూడెం,నారంవారిగూడెం లోని 5 కేంద్రాలను సందర్శించి కుట్టు పని ఎంతవరకు వచ్చిందో సమీక్ష చేసారు.త్వరితగతిన కుట్టు పని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ లు,సీసీ లు పాల్గొన్నారు.
Spread the love