నవతెలంగాణ- తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో సిఐ రఘువీర్ రెడ్డి ఎస్సై సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ శాగంటి అనసూయ రాములు , బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, బిజెపి కార్యాలయంలో బిజెపి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, జిల్లా నాయకులు వై. దినదయాల్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండల పరిషత్ మండల తహసిల్దార్ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ తోపాటు పలు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.