- Advertisement -
నవతెలంగాణ:రెంజల్
రెంజల్ మండలం నీల క్యాంపు గ్రామంలోని ఇందుస్మశాన వాటికకు వాడుతున్నటువంటి భూమి కొంతమంది కబ్జాకు పాలు పడ్డారని తహసిల్దార్ శ్రావణ్ కుమార్ స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయిలో అట్టి భూమిని పరిశీలించారు. నీలా క్యాంప్ గ్రామంలోని సర్వేనెంబర్586NSF కు సంబంధించిన9 గుంటల భూమిని కొందరు అక్రమంగా దున్నుకుంటున్నారని వారు ఆరోపించారు. స్మశాన వాటికను పరిశీలించిన తహసిల్దార్ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారన్నారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షులు క్యాతం యోగేష్, జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, స్థానిక రైతులు రమేష్, దాసు, రవి తదితరులు ఉన్నారు.
- Advertisement -