
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో మురగు కాలువ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావాణి(ప్రజా దర్బార్)లో శుక్రవారం నేలపట్ల సీపీఐ(ఎం) పార్టీ ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ వినతి పత్రం సమర్పించారు. నేలపట్ల గ్రామంలో 500 గడపలు 2500 జనాభా ఉన్నది మా గ్రామంలో ఎప్పటికీ మురుగు కాలువ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అక్కడే ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ప్రజాదర్బార్ లో వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా మా గ్రామానికి 2000 మీటర్ల డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తారని ఆశి నాకు మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విశ్వాసం ఉందని ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత తెలిపారు.