ప్రతీ సోమవారం విద్యుత్ ప్రజావాణి: ఏడీఈ వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ సమస్యలపై పరిష్కారం దిశగా “విద్యుత్ ప్రజావాణి” అనే కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10:00 గం. ల నుండి 13:00 గం. వరకు విద్యుత్ కార్యాలయాలలో నిర్వహించబడుతుంది అని ఎన్.పి.డి.సి.ఎల్ అశ్వారావుపేట సబ్ డివిజన్ ఏడీఈ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ “విద్యుత్ ప్రజావాణి” కార్యక్రమంలో భాగంగా 17 జూన్ 2024న అశ్వారావుపేట సబ్ డివిజన్ కార్యాలయం,అకౌంట్స్ కార్యాలయం, అశ్వారావుపేట,వినాయకపురం,దమ్మపేట, గండుగులపల్లి లో గల 33/11 కేవీ సబ్ స్టేషన్ లోని సహాయక ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను ఈ విద్యుత్ ప్రజావాణి లో సంప్రదించాలని కోరారు.
Spread the love