నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద వ్యక్తి అయినా ఏర్పుల ఉప్పలయ్యాకు కృత్రిమ కాలును అందజేసినట్లు బిఆర్ఎస్ నేత చిర్ర గోని కిరణ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా లక్ష్మీపురం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఏర్పుల ఉప్పలయ్య అనే వ్యక్తి జీవనోపాధితో హైదరాబాదు వెళ్లి కూలి పనిచేసుకుంటూన్న క్రమంలో అతని కాలుకు మొలగుచుకొని ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉంటూ ఆయన కు కాలు నడవడం అనే పరిస్థితి నెలకొన్న దాని అన్నాను. ఆయన కాలు పనిచేయకుండా ఆయన కాలు పనిచేయకుండా ఉందని అన్నారు. దీంతో వెంటనే ఆయన బాధపడుతున్న సందర్భంలో గతంలో ఎంపీగా ఉన్న మాలోతు కవితకు ఫోన్ చేసి అమ్మ మా గ్రామస్తుడు కాలు పోయి ఇబ్బందుల్లో ఉంటున్నాడని అతనికి ఒక కృత్రిమ కాలు ఇప్పించి ఆదుకోవాలని ఆమెను కోరినట్లు తెలిపారు. వెంటనే అప్పటి ఎంపీ కవిత స్పందించి ఖమ్మంలో ఒకరికి ఫోన్ చేసి లక్ష్మిపురం గ్రామస్పుడికి ఒక కృత్రిమ కాలు ఇవ్వాలని కోరిన వెంటనే అక్కడివారు కృత్రిమ కాలు ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. ఒక ఫోన్లో స్పందించిన మాజీ ఎంపీ కవితకు మేము అందరం రుణపడి ఉంటామని అన్నారు. వెంటనే ఆ కృత్రిమ కాలును నిరుపేద వ్యక్తి ఏర్పల ఉప్పలయ్యకు అందించి నడవడానికి సహకరిస్తున్నాడు అని అన్నారు మానవత్వం చాటుకున్న కవితమ్మకు ఎంతోమంది రుణపడి ఉంటామని చిర్రగోని కిరణ్ తెలిపారు.