ఆయిల్ ఫాం గెలలు ధరలు..

– ఆంధ్రా కంటే తెలంగాణ లోనే స్వల్ప మెరుగు 
నవతెలంగాణ – అశ్వారావుపేట
గతం లో సరిహద్దు రాష్ట్రం అయిన ఆంధ్ర లో ఆయిల్ ఫాం గెలలు ధర లు మెరుగు అని తెలంగాణ రైతులు సైతం మన గెలలు ను ఆంధ్ర లో విక్రయించే వారు.నేడు ఆ పరిస్థితి తిరగలి పడి తెలంగాణ గెలలు ధరే స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. వాతావరణం అననుకూల పరిస్థితుల్లో గెలలు దిగుబడి తగ్గినప్పటికీ ధరలు విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రం రైతులు కంటే తెలంగాణ రైతులకే కాస్త ఊరట అని పలువురు రైతులు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2024 లో ఈ 6 నెలలు కాలంలో తెలంగాణ – ఆంధ్రా టన్ను ఆయిల్ ఫాం గెలలు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
నెల       తెలంగాణ      ఆంధ్రా              వ్యత్యాసం
జనవరి  12,681       12,410                  + 271
ఫిబ్రవరి  13,135        12,845                 + 290
మార్చి   14,174       ‌  13,845                 + 329
ఏప్రియల్ 14,239       14,095                 + 231
మే           13,438      13,280                 + 158
జూన్        13,705     13,500                  + 205
వాస్తవానికి ఆయిల్ ఫెడ్ నిబంధనలు ప్రకారం అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఒక “ఆయిల్ ఇయర్” గా పరిగణిస్తారు.ఈ ఆయిల్ ఇయర్ జులై,ఆగస్ట్,సెప్టెంబర్,అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో గెలలు అధిక దిగుబడులు (పీక్) సీజన్ గా చెప్పుకుంటారు.ప్రస్తుతం సాదారణ నెలల్లో ఆయిల్ ఫాం గెలలు దిగుబడి తగ్గినప్పటికీ ఈ ఏడాది ఆయిల్ ఇయర్ ఈ పీక్ సీజన్ లో గెలలు దిగుబడి పెరిగే అవకాశం ఉందని ఆయిల్ ఫాం నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love