జియో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. పొంచిఉన్న ప్రమాదం

– భారీ గోతులు పూడ్చడం మరిచారు, వాహనదారులు గ్రహించకపోతే ప్రాణాలకే ముప్పు
– మైనర్లతో జెసిబి పనులు రోడ్డుపై రై రై.. రోడ్డు పక్కలో ఉన్న చెట్లు ధ్వంసం, జెసిబి ఓనర్ కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు ఉంటాయో, కొత్త మోటర్ వాహనం చట్టం అమలు అయ్యేనా
– గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీరాజ్ ఏఈ కి తెలియకుండా జియో కేబుల్ వర్క్ ఈ కాంట్రాక్టర్ చేసేది ఏ అధికారి ఎవరి పరిధిలో ..!? ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరు ?
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం నుండి ఉప్పునుంతల మండలలోని తాడూర్ గ్రామం పరిధిలో కొన్ని నెలల క్రితం నుండి బీటీ రోడ్డు రహదారుల వెంట కొనసాగుతున్న జియో అండర్ గ్రౌండ్ పనులు తాడూరు నుండి రాయి చేడు బీటీ రోడ్డు వెంబడి 100 మీటర్లకు ఒకటీ మూడు అడుగుల లోతు భారీ గోతులు తవ్వి ఇలా పదుల సంఖ్యలో తవ్వి గుంతలు పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేయటం పని ప్రదేశాలలో ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నెలలు గడుస్తున్న వదిలేయటం ప్రయాణికులు రెప్పపాటున గమనించకపోతే మనిషి ప్రాణాలకు ముప్పు వాటిల్లనుంది. ఇదిలా ఉండగా సోమవారం రోడ్డుపక్కల జియో నెట్ కేబుల్ కొరకు తవ్వకాలకు ఉపయోగిస్తున్న మోటర్ యంత్రం జెసిబి మైనర్ల చేతికిచ్చి పనులు కొనసాగిస్తూ మైనర్ బాలుడు నవతెలంగాణ కెమెరాకు చిక్కాడు జెసిబి నడుపుతున్న బాలుడిని విచారించగా 10 వరకు చదువుకున్న 17 ఏండ్లు ఉన్నాయని చెప్పాడు. జెసిబి ఓనర్ చరవాణిలో సమాచారం కోరగా బాబుకు 18 ఏళ్లు ఉన్నాయని కొత్త బండి నెంబర్ ప్లేట్ రాలేదని సమాధానం ఇచ్చారు. నెంబర్ ప్లేట్ లేని, మైనర్ చేతికి జెసిబి ఇచ్చిన బండి ఓనర్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. జియో కేబుల్ పేరిట జెసిబి సహాయంతో తీస్తున్న తవ్వకాలలో బీటీ రోడ్డు పక్కల ఉన్న పెద్ద చెట్లను ధ్వంసం చేసి పనులు కొనసాగిస్తుండడం పర్యావరణానికి దెబ్బతీసేలా పనులు కొనసాగిస్తున్నారు.
జెసిబి ఓనర్ కాంట్రాక్టర్ పై సంబంధిత శాఖ అధికారులు పని ప్రదేశాలను పూర్తిగా సందర్శించి కాంట్రాక్టర్ నిర్వాహకం పట్ల దర్యాప్తు చేసి అధికారులు కఠినంగా వ్యవహరిస్తారా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తీరుపై పంచాయతీరాజ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుపోగా మాకు ఎలాంటి సమాచారం లేదు మాకు తెలవదు అంటూ సమాధానం ఇచ్చారు. రోడ్లు, గ్రామాన్ని పర్యవేక్షణ కొనసాగించే అధికారులకు నెలలుగా కొనసాగుతున్న అధికారులకు తెలవని జియో కేబుల్ కాంట్రాక్టర్ ఉన్నట్లా లేనట్లా అనీ బాటసారులు, వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. సురక్షితంగా చేరే గమ్యానికి రోడ్డు పక్కల గుంతలు తీసి నిర్లక్ష్యంగా వదిలేసిన కాంట్రాక్టర్ పై సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Spread the love