నవతెలంగాణ – అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచించారు.నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల విద్యాభివృద్ధిపై ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలోలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, హెచ్ఎంలు జిహెచ్ఎంలు, ఎస్ఓ, ఎంఈఓ లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని పాఠశాలలో విద్యాభివృద్ధి, మౌలిక వసతులు తలపై సమీక్షించడం జరిగిందన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే విద్యాభివృద్ధికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రధానంగా అదనపు గదులు, టాయిలెట్లు, కొత్త బిల్డింగ్లకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు నివేదిస్తే ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.