చదవుకోవాలంటే కాలి నడకే శరణ్యం

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని రామారావు మహరాజ్ తాండ నిరుపేద విద్యార్థులు అక్షర జ్ఞ్యానం నేర్చుకోవాలంటే కాలినడకే శరణ్యం అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ తాండ నుండి సుమారు 10 నుండి 15 మంది చిన్నారులు తలబ్ తాండ లోని ప్రాథమిక పాఠశాలకు విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. కానీ విద్య నేర్చుకోవలంటే సుమారు 2 కి.మీ ల దూరం కాలి నడకతో వెళ్లాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ తాండ ఏర్పడి సుమారు 20 సంవత్సరాలు గడుస్తున్నా తమ పిల్లలకు మాత్రం విద్యను అందించే సౌకర్యం మాత్రం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.ఎన్నికలో ఓట్ల కోసం వచ్చిన నాయకులు ఎన్నికలు అయిన తర్వాత విస్మరిస్తున్నరాని తమ పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలంటే కష్టాలు తప్పడం లేదని స్పష్టం చేస్తున్నారు.రోజు పిల్లలు పాఠశాలకు కాలి నడకతో  వెళ్తున్న  కష్టంను చూసి గత సంవత్సరంలో పోచారం తండాకు చెందిన  పవార్ రాంసింగ్  తన వంతుగా పిల్లలకు ఉచిత ఆటో ప్రయాణం కల్పించడంతో విద్యార్థులు చదవుకున్నారని తెలిపారు.పేద కుటుంబంలో  డబ్బులు లేక ప్రభుత్వ పాఠశాలలోనే పంపిస్తున్నమని కానీ రోజు కాలి నడకతోనే వెళ్తున్నారని ప్రభుత్వ అధికారులు  స్పందించి పిల్లలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని తమ తండాలో పిల్లల చదువులు సాగెటట్లు చూడాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Spread the love