గ్రామాల్లో పలు పనులను పరిశీలించిన మండల ప్రత్యేకాధికారి.

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల, తడపాకల్ గ్రామాల్లో డిఎల్పీఓ(మండల ప్రత్యేకాధికారి)శివ కృష్ణ బుధవారం పర్యటించి, ఆయా గ్రామాల్లో జరుగుతున్న శానిటేషన్, వన మహోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు.ఇందులో భాగంగా ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ శివ చరణ్ , ఏపీఓ వెంకటేష్ , పంచాయతీ కార్యదర్శులు రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Spread the love