శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం గట్టుప్పల్ చండూరు కనగల్ పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది వివరాలు,సిబ్బంది పనితీరు, పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ,స్టేషన్ కేసుల స్థితిగతులు,పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు,శాంతిభద్రతలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మొదటి సారి పోలీస్ స్టేషన్ పరిశీలనకు వచ్చిన ఎస్ పి కి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు . ఈ కార్యక్రమాల్లో సి ఐ వెంకటయ్య,ఎస్ ఐ లు సురేష్, వెంకట్ రెడ్డి, రామకృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.