Monday, June 30, 2025
E-PAPER
Homeఆటలుఅల్కరాస్‌కు ఎదురుందా?

అల్కరాస్‌కు ఎదురుందా?

- Advertisement -

– బరిలో సినర్‌, నొవాక్‌ జకోవిచ్‌
– నేటి నుంచి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌
– లండన్‌ (ఇంగ్లాండ్‌)
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ మహా సమరం అభిమానుల మదిలో మెదులుతుండగానే.. మరో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. వరల్డ్‌ నం.1 జానిక్‌ సినర్‌ (ఇటలీ), నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) అతడికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆరంభం.

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌కు రంగం సిద్ధమైంది. రెండు సార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఆల్‌ ఇంగ్లాండ్‌ సెంటర్‌ కోర్టులో హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో మ్యాచ్‌ పాయింట్‌ను కాచుకుని జానిక్‌ సినర్‌కు ఊహించని షాక్‌ ఇచ్చిన అల్కరాస్‌.. వింబుల్డన్‌లోనూ టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు. పచ్చిక కోర్టుపై అల్కరాస్‌ వేగం, సుదీర్ఘ ర్యాలీలు, బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లు సహా సూపర్‌ సర్వ్‌ను ఎదుర్కొని నిలబడటం ప్రత్యర్థులకు కఠిన సవాల్‌గా నిలువనుంది. సోమవారం తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు పాబియో ఫోగ్నినితో కార్లోస్‌ అల్కరాస్‌ తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నం.1 అరినా సబలెంక (బెలారస్‌), ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ కొకొ గాఫ్‌ సహా ఇంగ్లాండ్‌ స్టార్‌ ఎమ్మా రెడాకాను టైటిల్‌ వేటలో ఫేవరేట్లుగా కనిపిస్తున్నారు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ నేటి నుంచి ఆరంభం కానుండగా..తొలి రోజే కీలక ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌, మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌లు నేడు రాకెట్‌ పట్టనున్నారు. రష్యా స్టార్‌ ఆటగాడు డానిల్‌ మెద్వదేవ్‌, అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌, రూనె, బెరెటాని, ఒలీవర్‌, స్టెఫానోస్‌ సిట్సిపాస్‌లు నేడు తొలి రౌండ్లో ఆడనున్నారు. మహిళల సింగిల్స్‌లో అరినా సబలెంక, ఫెర్నాండేజ్‌, ఎలినా స్వితొలినా, ఒస్టాపెంకో, మడిసన్‌ కీస్‌, జాస్మిన్‌ పావొలిని, ఎమ్మా రెడుకానులు తొలి రౌండ్లో ఆడనున్నారు. వింబుల్డన్‌ మ్యాచులు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆరంభం అవుతాయి. భారత్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ వింబుల్డన్‌ మ్యాచులను ప్రసారం చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -