నవతెలంగాణ-తొగుట : సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించా లని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సూచించారు. మంగళవారం తొగుట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన వి. రవికాంత్ రావు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ను కలసి పూల మొక్కను అందజేశారు. పోలీసు కమిషనర్ ఎస్ఐని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ శాంతి భద్రతలకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజ లకు అవగాహన కల్పించా లని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అన్నారు. నూతన చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి దరఖాస్తుపై విచా రణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పా రు. నేను సైతం కార్యక్రమం ద్వారా గ్రామాలలో పనిచేయని సీసీ కెమెరాలు గ్రామస్తులు, వ్యాపారస్తులతో కలసి వెంటనే రిపేర్ చేయించాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాల రహిత జిల్లా గా సిద్దిపేటను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.