– ప్రజావేగ్గేయకారుడు రాజారాం ప్రకాష్
– టీజేఏసీ ఆధ్వర్యంలో ఘననివాళి
నవతెలంగాణ-వనపర్తి
శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రజా వాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవర ణలో శనివారం టీజేఏసీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష శాస్త్ర వేత్త, రాజకీయవేత్త, మాజీ రాష్ట్రపతి, పద్మభూషణ్ పద్మవిభూషణ్, భారతరత్న బిరుదులు సంపాదించిన ఏకైక వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. కలలు కనండి.. వాటిని సాకారం చేసు కోండని యువతలో దివ్యాగ్ని రగిల్చిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొన్ని తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కవి పండితుడు బూరోజు గిరిరాజా చారి, కవి, వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ, తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు, రజక సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య, జానపద గా యకుడు మల్లెపు నరసింహ, మైనార్టీ సంఘం జిల్లా నాయకుడు బాలేమియ, కౌన్సిలర్ భాషా నాయక్, గౌడ సంఘం జిల్లా నాయకుడు నిదర్శన్ గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బిచు మాదిగ, బుడగ జం గాల హక్కుల పోరాట సమితి నాయకుడు సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.