Tuesday, July 1, 2025
E-PAPER
Homeవరంగల్పులి కాదు…హైనా.!

పులి కాదు…హైనా.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్‌రావు: మండలంలోని కొయ్యూరు-ఎడ్లపల్లి పరిసరప్రాంతాల్లోని పోడు భూమి పత్తి చేన్లలో సోమవారం ఉదయం రైతులు పాదముద్రలు గుర్తించి పెద్దపులిగా అనుమానం వ్యక్తం చేశారు.పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు అది పెద్దపులి కాదు హైన (కొండ్రిగాడు) అనే ఓ జంతువు పాదముద్రలని స్పష్టం చేశారు.పెద్దపులి సంచరించిన విషయం వాస్తవమే కానీ అది ఇప్పుడు ఈ అడవిలో ఉన్నట్లు ఆనవాలు ఎక్కడ కనిపించడం లేదు. హైనా అనే జంతువు సంచరించడం పెద్దపులి పాదాలకు దగ్గర పోలికలతో జంతు పాదముద్రలు ఉండడం ఆసక్తికరమైన విషయం.రైతులెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అది హైనాని హాని కలిగించే జంతువు కాదు అయినా ఎవరి జాగ్రత్తలో ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -