ఆశ, జీపి వర్కర్లు అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

Asha, GP workers were illegally arrested by the police– ఫిక్స్ డు వేతనం లేక  అల్లాడుతున్న ఆశ వర్కర్లు
– కనీస వేతనాలు అమలు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు
నవతెలంగాణ –  దుబ్బాక రూరల్ 
సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ వారి కళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలను కోరుతూ శాంతియుతంగా ధర్నా చేయడానికి చలో హైదరాబాద్ బయలుదేరిన రెండు రంగాల కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా సిఐటియు అనుబంధం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఫిక్స్ డు వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ మరియు గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తూ కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఈ రెండు రంగాల కార్మికుల సమస్యల పట్ల చలో హైదరాబాద్ కు వెళ్తుంటే ముందస్తూగా పోలీసులు ధర్నాకు అనుమతులు ఇచ్చి కిందిస్థాయి పోలీస్ లతో అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆశ వర్కర్లు గత కొన్ని సంవత్సరాలుగా  తెలంగాణ పేదప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ అనేక సేవలందిస్తున్నారని గుర్తు చేశారు.
కరోనా సందర్భంగా ఆశ వర్కర్ల సేవల అంతర్జాతీయంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అవార్డులు కూడా అందించిందని గుర్తు చేశారు.కానీ ఆశ వర్కర్లకు ఫిక్స్ డు వేతనాలు అమలు కావడం లేదని మరియు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కారం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు తమ మ్యానిఫెస్టోలో పెట్టిన వాటినీ కూడ అమలు చేయడం లేదని విమర్శించారు.గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలపై శాంతియుతంగా హైదరాబాద్ ధర్నాకు వెల్లె జిపి వర్కర్లను కూడా అక్రమంగా అరెస్టు చేయడం చాలా అన్యాయమని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో  ఉద్యమాన్ని ఆపలేరని,కార్మిక ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూడడం అన్యాయం అన్నారు.ఆశ, జిపీ వర్కర్ల సమస్యలపై ధర్నా సందర్భంగా అక్రమ అరెస్టును ఖండించాలని పిలుపునిచ్చారు.ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని,ఉద్యోగ  భద్రత కల్పించాలని సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నాకు  వెళ్తున్న నాయకులను ఉదయం 5 గంటల నుంచి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఇదేమి ప్రజాస్వామ్యం అనీ ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ఉన్న శ్రద్ధ ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలపై ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆశ మరియు గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి ఫిక్స్ డు వేతనాలు కనీస వేతనాలు అమలు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ చంద్రకళ, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎల్లయ్య,రాజు,ప్రభాకర్, పెంటయ్య,కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love