– ఇద్దరు దొంగల అరెస్ట్
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం చోరీ జరిగినట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రాజన్నగౌడ్ శనివారం ఉదయం ఆలయానికెళ్లగా ఆలయం తలుపులు పగలగొట్టి ఉండడంతో లోనికెళ్లి చూశాడు. ఆలయ గుడి గంట, గ్యాస్ సిలిండర్ కనిపించలేదు. శుక్రవారం రాత్రి దొంగతనం జరిగినట్టు భావించి గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. శనివారం పాంగ్రా గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. టివిఎస్ ఎక్సెల్(టిఎస్18డి7118)పై గుడి గంట, గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తుండగా వెంబడించి పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిని రిమాండ్‌కు పంపుతున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.