నవతెలంగాణ – గోవిందరావుపేట
లక్నవరం చెరువు ప్రధాన కాలువలను పూడికతీత పనులను వెంటనే చేపట్టి ఎండుతున్న పంటలకు మీరందెలా చూడాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డి పిచ్చి మొక్కలతో నిండిన లక్నవరం చెరువు ప్రధాన కాలువలను మరియు నీరందక ఎండిపోతున్న ఆయకట్టు పొలాలను సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మండలం లోని లక్నవరం చెరువు కింద ప్రధాన కాలువలు నర్సింహుల, రంగాపూర్, శ్రీరామ్ పతి, కోట కాలువ షిల్ట్ తీయకపోవడం వల్ల చెరువులో నీళ్లు ఉండి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నరు. లక్నవరం చెరువు కింద 8700 ఎకరాలు అధికంగా సాగవుతుండగా అనధికారికంగా మరో రెండు వేల ఎకరాలు సాగుతున్నది గత ప్రభుత్వంలో పదేళ్లలో కాలువలు ఏనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులే ఎకరాకు రూ.200 నుండి వెయ్యి రూపాయల వరకు జమ వేసుకొని కాలువలు బాగు చేసుకుంటున్నారు. గండ్లు పూడ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా కాలువలకు ఎలాంటి డబ్బులు కేటాయించకుండా పంటలు ఎండుతున్నా, ఐబీ అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం పది లక్షల రూపాయలు కేటాయిస్తే చెరువు క్రింద ప్రధాన కాలువలు షీల్డ్ తీసే అవకాశం ఉన్నదని మంత్రిగారు జోక్యం చేసుకొని వెంటనే కాలువలు షీల్డ్ తీయాలని రైతులకు నీరు అందించాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరము రైతులు సన్నధాన్యం ప్రధానంగా కె.ఎన్ ఎం 16 38, 12 24 స్వల్పకాలిక రకాలను నాటు వేసినారని ఇప్పుడు గాని పొలాలు ఎండిపోతే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత వారం రోజులుగా నీళ్లు వదిలిన వేలాది ఎకరాలకు మీరు అందలేదని తిరిగి ఇప్పుడు అధికారులు నీరు నిలిపివేసినారని పేర్కొన్నారు. అధికారుల అనాలోచితిన నిర్ణయం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని వెంటనే అధికారులు పొలాలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కాలువలు షీల్డ్ తీసి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతుల సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పొదిలి చిట్టిబాబు జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి, గొంది రాజేష్ మండల కమిటీ సభ్యులు కడారి నాగరాజు, సోమ మల్లారెడ్డి, కొట్టే కృష్ణారావు, సప్పిడి ఆదిరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఇతరులు పాల్గొన్నారు.