వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక, దోహా, ఖతార్ సంయుక్త నిర్వహణలో నవంబర్ 22-23, 2024 తేదీలలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దోహా మహానగరంలో జరుగుతుంది. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహెరైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, అబుదాబి, రాస్ అల్ ఖైమాహ్ మొదలైన అనేక స్థానిక దేశాల తెలుగు సంఘాలు (సహకార సంస్థలు) పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే.
– వంగూరి చిట్టెన్ రాజు