జన్నారం మండలం దేవునిగూడ గ్రామం లో గల్ఫ్ నిరుపేద కార్మికుడు చొప్పదండి దుబ్బయ్య భార్య ఇటీవల క్యాన్సర్ తో మరణించడంతో నిరుపేద కుటుంబానికి దేవుని గూడా గల్ఫ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సోమవారం రూ.5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని 50 కిలోల బియ్యాన్ని అందించారు. సందర్భంగా గల్ఫ్ సంక్షేమ సమితి నాయకులు మాట్లాడుతూ.. గల్ఫ్ లో ఉండి వేలాది రూపాయలు రాష్ట్రానికి తీసుకువచ్చిన వారి కుటుంబాల కు జీవనోపాధి మాత్రం కొనసాడం లేదన్నారు. అరె కాడితే డొక్కాడ నీ ఇలాంటి గల్ఫ్ కటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికుల సంక్షేమ్ కొరకు 500 కోట్లతో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌరవ ఆద్యక్షులు కునారపు భీమరాజు అధ్యక్షులు సాంబారి రవి,వర్కింగ్ ప్రెసిడెంట్ రాగాల మల్లేష్ క్యాషియర్ ఏడేలి సత్తన్న,ఉపాద్యక్షులు కర్నె సురేందర్ కార్యదర్శులు దేసవేని గోపాల్ , మల్లేష్, సభ్యులు కునారపు గంగాధర్, కాల్వ సాయికుమార్ ,కుశనాపెలి రాజన్న మహేష్ పాల్గొన్నారు.