యాదగిరిగుట్ట ఎంపిడిఓ కార్యాలయం శుక్రవారం, ఆలేరు బ్లాక్ జాయింట్ మండల లెవెల్ బ్యాంకర్ కమిటీ సమావేశం నిర్వహించారు. లీడ్ బ్యాంక్ యాదాద్రి భువనగిరి మేనేజర్ శివ రామ కృష్ణ అధ్యక్షతన జరిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామ కృష్ణ మాట్లాడుతూ పంట ఋణ మాఫీ కి సంబంధించిన గాని ప్రజా ప్రయోగ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. డివిఏహెచ్ఓ జెడి కృష్ణ, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సమావేశం లో నాబార్డ్ డి డి ఏం వినయ్ కుమార్, ఎస్ సి కార్పొరేషన్ ఈడి శ్యాంసుందర్, యాదగిరి గుట్ట ఎంపిడిఓ నవీన్ కుమార్, అడిషనల్ డి ఆర్ డి ఏ శ్రీనివాస్, ఏ డి ఏ శాంతి నిర్మల, ఆలేరు బ్లాక్ కి సంబంధించిన అన్ని బ్యాంకర్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.