‘కరీంనగర్ కథలు’ పుస్తక పరిచయ సభ
రంగినేని సుజాతా మోహన్‌రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సిరిసిల్ల ఆధ్వర్యంలో ‘కరీంనగర్ కథలు’ పుస్తక పరిచయ సభ ఈ నెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు రంగినేని ట్రస్ట్, కరీంనగర్‌లో జరుగుతుంది. ఈ సభకు రంగినేని మోహన్‌రావు, ఆచార్య సి.మృణాళిని, అల్లం రాజయ్య, ఆచార్య సి.కాశీం, జూకంటి జగన్నాథం, డా||నలిమెల భాస్కర్, రంగినేని నవీన్ కుమార్ హాజరవుతారు.
కవి సంధ్య స్వర్ణోత్సవ సంచిక, కవన కోకిలలు ఆవిష్కరణ
ఈ నెల 14, ఉదయం 10గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో కవి సంధ్య 50 వ సంచిక ఆవిష్కరణ సభ జరుగుతుంది. శివారెడ్డి, రమణాచారి, కె. శ్రీనివాస్, వాడ్రేవు చినవీరభద్రుడు, మామిడి హరికృష్ణ, దాట్ల దేవదానంరాజు, ఏనుగు నరసింహా రెడ్డి, కోయి కోటేశ్వరరావు, గూటం స్వామి పాల్గొంటారు. ఇదే సభలో నాగరాజు రామస్వామి గారి ‘కవన కోకిలలు’ పుస్తకం ఆవిష్కరణ, అంకితం ఉంటుంది. – శిఖామణి, కవి సంధ్య
బెల్లి యాదయ్యకు ఉదారి నాగరాజు స్మారక అవార్డు
కవి ఉదారి నాగదాసు స్మారక కవితా వార్డును ఈ సంవత్సరం ప్రముఖ కవి బెల్లి యాదయ్యకు ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానం ఈ నెల 15వ తేదిన ఆదిలాబాద్‌లో జరుగుతుంది.
– డా. ఉదారి నారాయణ, 9441413666
వర్గీకరణ సంఘీభావ కవితల కోసం
ఎస్సీ, ఎస్టీల్లో అభివృద్ధి పరంగా మరింత వెనకబడ్డ కులాలు, జాతులకు విద్య, ఉద్యోగ రంగాలలో ప్రాధాన్యతతో కూడిన పంపిణీ న్యాయం కల్పించడానికి సుప్రీమ్ కోర్టు ఇటీవల రాష్ట్ర ప్రుత్వాలకు తగిన అధికారం ఉందని తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంఘీభావంగా తీసుకురాబోయే పుస్తకానికి వచన, పద్య కవితలను అక్టోబర్ 15 లోగా పంపవల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కవితలు పంపవలసిన అడ్రస్: ప్లాట్ – 297,రోడ్ – 21, సెక్రటేరియట్ కాలనీ, సియుసి పోస్ట్,గచ్చిబౌలి, హైదరాబాద్ – 500046 వాట్సప్ నంబర్లు: 9441091305, 9948311667, మెయిల్ ఐడి – [email protected]