తెలంగాణ ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హలులో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, జిల్లా ఉద్యోగుల జె.ఏ.సి. చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.