నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలందించిన ఆర్జీలను ప్రత్యేక దృష్టితో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 51 ఆర్జీలను స్వీకరించారు. అర్జీలలో రెవిన్యూ శాఖ 35, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 3, ఎంప్లాయిమెంట్ 2, అటవీ శాఖ 2, పంచాయతీరాజ్ 2, రోడ్లు భవనాలు, నీటిపారుదల, పోలీస్, గృహ నిర్మాణ, లీడ్ బ్యాంక్, జిల్లా పరిషత్, ఎక్సైజ్ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శోభారాణి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.