ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

Distribution of free study material– ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చదువుతున్న విద్యార్థులకు వృక్షశాస్త్ర అధ్యాపకుడు మర్సకట్ల అనిల్ కుమార్ ఏడు వేల రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగకుటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడు మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వృక్ష శాస్త్ర అధ్యాపకుడు అనిల్ కుమార్ స్టడీ మెటీరియల్ ను స్వంతంగా తయారుచేసి, సుమారు 7000 రూపాయల స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అధ్యాపక వృత్తిలోకి వచ్చిన సంవత్సరం నుండి అనిల్ కుమార్ ఉచితంగా స్టడీ మెటీరియల్ ను ప్రతి సంవత్సరం కళాశాల చదువుతున్న విద్యార్థులకు అందజేస్తూ ప్రభుత్వకళాశాలలో చేరిన గ్రామీణ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజాభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం స్టడీ మెటీరియల్ దాత అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, విద్యార్థులు ఈ నాణ్యమైన స్టడీ మెటీరియల్ ను వినియోగించుకొని, అత్యంత ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి గౌరవం తీసుకురావాలని కోరారు. స్టడీ మెటీరియల్ ను సులభ పద్ధతిలో రూపొందించి, విద్యార్థులకు ఉచితంగా అందించిన వృక్ష శాస్త్ర అధ్యాపకుడు  మర్సకట్ల అనిల్ కుమార్ ను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బండి శ్రీనివాస్, బంటు కవిరాజు, ముక్కెర ప్రకాష్ బాబు, ప్రభుత్వ అధ్యపకుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎనమాల సుధాకర్, పెద్ద్దూరి వెంకటేశ్వర్లు, కక్కెర్ల రామ్మూర్తి, కూన సతీష్, లాడే మహేందర్, దేశెట్టి యాకన్న మరియు అధ్యాపకేతర ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్, మంగమ్మ, అరుణ, రమ, వెన్నెల,బిచ్చు  బృందం పాల్గొన్నారు.
Spread the love