- Advertisement -
- బండారు పోసిన సర్వసమాజ్ ప్రతినిధులు
నవతెలంగాణ-కంఠేశ్వర్: నేడు సర్వసమాజ్ కమిటీ శ్రీ విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం, గాజుల్ పేట్ వారి ఆధ్వర్యంలో 13న జరిగే ఊర పండుగకూ అంకురార్పణగా గాజులు పేట్ వీధిలల్లో బండారు ను పోశారు. ఈ సందర్బంగా సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మన పెద్దల ద్వారా అనావాయితీగా ఆచారం అనుగుణంగా ఈ ఆషాడ మాసంలో వర్షాలు సమృద్ధి పడాలని, ప్రతీ ఏటా ఆచారాన్ని పాటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ జాయింట్ సెక్రటరీలు మల్కాయ్ సుదర్శన్, పసుల రాజు కార్యవర్గ సభ్యులు కొత్మీర్ సతీష్, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్, పెద్ద కాపులు కోరడి చిన్న నర్సయ్య, మల్కాయ్ లక్ష్మినారాయణ, కోర్వ భూపాల్, గంట పెద్ద నర్సయ్య, ప్రతినిధులు భైర శైలేందర్, కోరడి గోపి, ఈర్ల సాయన్న, ఆదే నర్సయ్య, వెల్మల్ గంగాధర్, కోటకింది నర్సయ్య, కొత్మీర్ పెద్ద సాయన్న, నరాల చక్రధర్, బెల్లల్ కుమార్, రామాడ్గు బాలకిషన్, మల్కాయ్ మహేందర్, సుంకటి శేఖర్, కోటకింది శేఖర్, కొట్టె సాయిబాబా, సుంకేటి విశాల్, భైర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -