క్షేత్ర సందర్శన లో ప్రత్యేక అనుభవం

Unique experience in field visitనవతెలంగాణ – పెద్దవూర
ఈ రోజుల్లో విద్య అనేది అభ్యాసకుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకునే అంశంగా అభివృద్ధి చెందింది. ఇకపై తరగతి గదుల్లో నాలుగు గోడల మధ్యకే పరిమితం కాకుండా దాటిపోయింది. తరగతి గది వెలుపల విద్య అనేది తరగతి గదితో పాటు సెట్టింగ్‌లలో బోధన మరియు అభ్యాసాన్ని సూచిస్తుంది. ఇది అభ్యాసకులను బయటికి తీసుకురావడం మరియు వారికి విద్యాపరంగా ప్రయోజనకరమైన, వినోదభరితమైన, వృత్తి పరమైన  కార్యకలాపాలను అందించడంపై దృష్టి పెడుతుంది.అందులో భాగంగా క్షేత్రస్థాయి సందర్శనతో విద్యార్థుల్లో నైపుణ్యం, మెలకువలు నేర్చుకోవడంతో పాటు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని దేవరకొండ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు రెబాక పేర్కొన్నారు. శనివారం దేవరకొండ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల 9, 10 తరగ తుల నుంచి సుమారు 65 మంది విద్యార్ధినులతో పాటు వృత్తి విద్యా ఉపాధ్యాయురాలుఅనిత, శ్రీలత పెద్దవూర మండలం కేంద్రం లోని విశ్వానాథ జిన్నింగ్ మిల్లు ను కేంద్రాన్ని సందర్శించారు. ఇందులో క్షేత్రస్థాయి సందర్శనలో బొగుమల ఎంటర్ ప్రైజెస్ ప్రయివేట్ లిమిటెడ్ టైలరింగ్,ఒకేషనల్ కోర్స్ పై విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహన కల్పించారు. వృత్తి విద్య లో మెలకువలు నేర్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ వృత్తి విద్యా నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
Spread the love