గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

Teacher died of heart attackనవతెలంగాణ – పెద్దవంగర

మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోదుమళ్ల రవికుమార్ (54) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా మామునుర్. ఉద్యోగ రీత్యా, తొర్రూరు పట్టణ కేంద్రంలో నివాసముంటూ, విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండో శనివారం కావడంతో ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. ఆ సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను దగ్గరలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవికుమార్ కు భార్య రజిని, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవికుమార్ మృతదేహాన్ని ఎంఈవో గుగులోత్ రాము, నోడల్ హెచ్ఎం బుధారపు శ్రీనివాస్, చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్, పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు కవిరాజు, రంజిత్ సందర్శించి నివాళులర్పించారు.
Spread the love