– కలెక్టర్ వెంకటేష్ దోత్రే
– ఘనంగా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
తెలంగాణ కోసం పోరాడిన తొలి తరం ఉద్యమ నేత ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారి సజీవన్ అధ్యక్షతన నిర్వహించారు. వేడుకలకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వరరావుతో కలిసి కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కన్నీళ్లతో కాదు కసితో తెలంగాణను సాధించాలంటూ’ బాపూజీ చేసిన ఉద్యమ వ్యాఖ్యలు గుర్తు చేశారు. జిల్లాకు చెందిన బాపూజీ తొలితరం ఉద్యమ నేత కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ఆధ్యుడు బాపూజీ అని కొనియాడారు. పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రూప్నర్ రమేష్, గౌరవ అధ్యక్షులు పొన్న రమేష్, బిజెపి నాయకులు కొంగ సత్యనారాయణ, బిసి సంఘం నాయకులు పందాల వెంకన్న, వైరాగడే రమేష్, మోర్ల తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ ఆలి బిన్ అహ్మద్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రేగుంట కేశవ్, పద్మశాలి సంఘం నాయకులు నల్లా కనకయ్య, హనుమల్ల కేదారి పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా నాయకులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గరిపెల్లి కరుణగౌడ్, నాయకులు కానోజీ రమేష్, బండారి వెంకటేశం, దుర్గం తుకారాం, వంశీ, వెంకట్, వసంత్, సునీత పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని అంకసాపూర్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్, బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి పస్తం అంజయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు వడ్లూరి కిరణ్, రేగుంట శ్రావణ్ పాల్గొన్నారు.
వాంకిడి : మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతి వేడుకలను లక్ష్మణ్ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ అవినాష్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో బాపూజీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి మండలాధ్యక్షుడు గాదె అనిల్‌కుమార్, దేవాదాయ కమిటీ మండలాధ్యక్షుడు గాదె ప్రవీణ్, వ్యాపారవేత్త శివకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నులే నారాయణ, లక్ష్మణ్ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు మోల్కార్ అశోక్, కార్యదర్శి మడావి దౌలత్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, జమల్పూరి సూధాకర్, జయరాం, దీపక్ముండె, మాజీ సర్పంచ్ తుకారాం పాల్గొన్నారు.
బెజ్జూర్ : మండలంలోని సలుగుపల్లిలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పద్మశాలి సేవా సంఘం నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం మండల అధ్యక్షులు సామల తిరుపతి, ప్రధాన కార్యదర్శి తనికుట్ల వెంకటేష్, అవధూత సత్యనారాయణ, కొప్పుల దిలీప్, తేలి రాజేష్, భోగ విలాస్, పడాల సదాశి, కొంగ శంకర్, సామల వెంకటేష్ పాల్గొన్నారు.