గ్రామ సమస్యలు పరిష్కరించాలని

Adilabad– రోడ్డుపై నిలిచిన మురుగు నీటి వద్ద నిరసన
నవతెలంగాణ-దహెగాం
మండలంలోని హత్తిని గ్రామ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డుపై నిలిచిన మురుగు నీటి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు కుందరం మంజుల మాట్లాడుతూ గ్రామ సమస్యలను పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుపై నీటి గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు కాలువలు నిర్మించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు శ్రీను, ప్రేమల, భీమేష్‌, గంగ, అజరు, నిహారిక, సుమలత పాల్గొన్నారు.

Spread the love