అధిక బిల్లుపై రోగి బంధువుల ఆందోళన

 Adilabad– ప్రయివేట్‌ ఆస్పత్రి ఎదుట బైటాయింపు
నవతెలంగాణ-ఖానాపూర్‌
అనారోగ్యం వచ్చిందని ప్రయివేట్‌ ఆస్పత్రికి వెళ్లే అధిక బిల్లు వేశారని రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన పట్టణంలో జరిగింది. శుక్రవారం ఖానాపూర్‌ పట్టణానికి చెందిన మల్లవ్వ ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లింది. చీటీపై మందులు రాసి ఆస్పత్రిలో చేరింది. తూతూ మంత్రంగా వైద్య నిర్వహించి ఎక్కువ డబ్బులు అడిగారని సరైన వైద్యం కూడా చేయలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయమై సరైన వైద్యం చేయకుండా అధిక బిల్లు వేశారని రోగి బంధువులు ఆందోళన చేపట్టారు. అనంతరం యాజమాన్యాన్ని నిలదీయగా తెల్ల కాగితంపై బిల్లు వేసి ఇచ్చారని బాధితురాలు తెలిపారు. అంతే కాకుండ వైద్యం చేసే మహిళా వైద్యురాలికి ఎంబీబీస్‌ కూడా పూర్తి కాలేదని ఎలాంటి అర్హత లేని వైదిరాలితో చికిత్సలు చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న నిర్మల్‌ డీఎంహెచ్‌ఓ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేసి మహిళ వైద్యురాలికి అర్హత లేదని ఆమె వైద్యం చేయరాదన్నారు. ఈ ఘటనపై ఆ ఆస్పత్రికి జరిమానా విధిస్తామన్నారు.

Spread the love